-
మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు – ప్రధానోపాధ్యాయులు రమేష్
క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేములపల్లిలో నిర్వహించిన సాంఘిక శాస్త్ర కాంప్లెక్స్ సమావేశంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ.. మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు వివిధ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతులను విజయవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు మారం పద్మ, రెడ్యానాయక్, వంగాల ప్రభాకర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షులు నల్లమేకల వెంకయ్య, మాలి సైదులు, అమరేందర్ రెడ్డి, రహీం, సైదా నాయక్, కురువ నాయక్, అంబటి వీరనారాయణ, సురేష్, హరిలాల్, బొడ్డు సైదులు తదితరులు పాల్గొన్నారు.
