-
లెక్కలడిగిన వార్డు మెంబర్.. రెచ్చిపోయిన కొండూరు సర్పంచ్.
-
పీకుతవా అంటూ గ్రామ పంచాయతీలో రచ్చ
-
దాడికి ప్రయత్నం.. కేసు పెడుతానని బెదిరింపులు!?
-
గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అంటూ ఆరోపణలు.
మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై, కొండూరు గ్రామస్తులు సర్పంచ్ పై విరుచుకు పడ్డారు. ఈ క్రమంలో నాలుగవ వార్డు మెంబర్ నవీన్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ సీతారాం నాయక్ ను ప్రశ్నించారు. పంచాయతీ నిధులు అడ్డగోలుగా డ్రా చేస్తున్నారని.. లెక్కలు చెప్పాలని నిలదీశారు.!?
ఈ క్రమంలో సర్పంచ్ కోపంతో ఊగిపోయి, వార్డు మెంబర్ నవీన్ పై దాడికి ప్రయత్నం చేయబోయినట్లు సమాచారం.!? ఈ ఘటనను వీడియో తీసిన గ్రామస్తులు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోలో సర్పంచ్ మాట్లాడే విధానం, దురుసు తనం ఆ హోదాకు భిన్నంగా ఉన్నట్లు, ఒక గ్రామ ప్రధమ పౌరుడు మాట్లాడే విధానం ఇది కాదని, వీడియో చూసిన చాలా మంది సర్పంచ్ తీరుపై మండిపడుతున్నారు. అందరికీ జవాబుదారిగా ఉండాల్సిన సర్పంచ్, అడిగిన వారిపై చిరెత్తిపోవడం పీకుతవా అంటూ దురుసుగా ప్రవర్తించడంపై స్థానికులు గుర్రుమంటున్నారు.
-
నిధుల దుర్వినియోగంపై అధికారులకు ఫిర్యాదు చేస్తాం- వార్డు మెంబర్ నవీన్
మర్రిగూడ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలతో పోటీపడి, జరిగని పనులకు దొంగ బిల్లులతో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తున్న, గ్రామ సర్పంచ్ సీతారాం నాయక్ పై చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్ నవీన్ కోరారు. ఇప్పటికే లక్షల్లో ప్రభుత్వ సొమ్మును డ్రా చేసినట్లు ఆయన ఆరోపించారు.
నిజాయితీగా ఖర్చు చేసి ఉంటే ప్రజలకు లెక్కలు ఎందుకు చెప్పడం లేదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో సర్పంచ్ గా ఎన్నుకుంటే, వెన్నుపోటు పొడవటం సరికాదన్నారు. లెక్కలు అడిగిన వారిపై దాడికి ప్రయత్నం చెయ్యడమే కాకుండా, నోటికి వచ్చిన బూతులు తిట్టడంతో పాటు తప్పుడు ప్రచారాలు చేస్తూ, కేసు పెడుతానని బెదిరిస్తున్నాడని నవీన్ ఆరోపించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటూ పంచాయతీ నిధులపై లెక్కలు అడిగే హక్కు లేకుండాపోయిందన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టి, పంచాయతీ నిధుల అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
