-
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి
-
లేదంటే 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతర పెడ్తరు
-
టీఆర్టీయూ అనుబంధ ఆటో కార్మికుల సంఘం నాయకుల హెచ్చరిక
-
ధర్నా చౌక్ లో డ్రైవర్ల దీక్ష.. మహాధర్నా …!
హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఆటో కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వానికి కూడా బతికి బట్టకట్టిన చరిత్ర లేదని తెలంగాణ రక్షణ సేన కార్మిక విభాగం టీఆర్టీయూ నేతలు అన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోలు నడిపించాలన్న నిర్ణయం ఆటో కార్మికుల జీవితాలను ఆగం చేస్తుందన్నారు. వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) అనుబంధ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఆటో కార్మికులకు అన్యాయం చేసే 263 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 20 మంది ఆటో కార్మికులు దీక్ష చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టకొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఆటో డ్రైవర్లతో పెట్టుకుంటే పుట్టగతులుండవు- రూప్ సింగ్..
Also Read:బాలిక గర్భవతి అంటూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్ధారణ.. ప్రైవేట్ పరీక్షల్లో ట్విస్ట్
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతోందని టీఆర్ఎస్ సీనియర్ నేత రూప్ సింగ్ మండిపడ్డారు. ఫ్రీ బస్సు పేరుతో ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టిందని విమర్శించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి భారం కాకుండా వారి బతుకేదో వారు బతుకుతున్నారన్నారు. అలాంటి ఆటో డ్రైవర్ల జీవితాలపై పిడుగు వేసినట్లు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడపాలని నిర్ణయించటం సరికాదన్నారు. ఆటో డ్రైవర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టకట్టలేదని, రేవంత్ సర్కార్ కు కూడా అదే గతి పడుతుందన్నారు. వెంటనే ఎలక్ట్రిక్ ఆటోల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆటో డ్రైవర్లు పాతరేస్తారని హెచ్చరించారు.
ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగితే ఊరుకోం – బోడ జనార్థన్
Also Read: America–Iran War : హోర్ముజ్‌పై హైటెన్షన్.. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారికి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్థన్ హెచ్చరించారు. ఎలక్ట్రిక్ ఆటోలను ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపాలని నిర్ణయించటం సరికాదన్నారు. ఆటో డ్రైవర్ల కు మంచి చేయకపోయినా సరే చెడు చేసే కార్యక్రమాలు వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read:భార్యపై అనుమానం.. ఇటుకతో దాడి చేసి హత్య చేసిన భర్త
ఆటోడ్రైవర్లకు అన్యాయం చేసే జీవో 263 ను వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆర్.వి. ఆర్ ప్రసాద్, నరేష్ ప్రజాపతి డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై చేసే ఈ పోరాటంలో ఆటో డ్రైవర్లంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పడాల మనోజ గౌడ్, వీరన్న తో పాటు ఆటో యునియన్ నాయకులు ఎం. ఎ సలీం, నజీరోద్దీన్, మహేందర్ నాయక్, శ్రీధర్, శివ ప్రసాద్, అబ్దుల్ గని, టీఆర్టీయూ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు
