Homeసినిమామిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాపీరైట్ వివాదం.. దిల్ రాజుకు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట!

మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాపీరైట్ వివాదం.. దిల్ రాజుకు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను నటించిన మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదంలో ట్రయల్ కోర్టు విచారణపై గతంలో విధించిన స్టేను ఎత్తివేయాలని కోరిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న స్టేను తొలగించేందుకు ధర్మాసనం నిరాకరించింది.ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో ఈ వ్యవహారానికి సంబంధించిన వాదనలు విన్న తర్వాతే ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఎప్పుడు తదుపరి విచారణకు తీసుకోవాలో పరిశీలిస్తామని తెలిపింది.మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా 2011లో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే సినిమా విడుదలైన కొన్నేళ్ల తర్వాత కాపీరైట్ వివాదం తెరపైకి వచ్చింది. రచయిత్రి ముమ్మిడి శ్యామలరాణి తన నా మనసు కోరింది నిన్నే నవలలోని అంశాలను ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కించారని ఆరోపిస్తూ 2017లో కోర్టును ఆశ్రయించారు.

ప్యాకేజీ కాదు.. అసలు పాన్ మసాలానే బ్యాన్ చేయండి!

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు దిల్ రాజుతో పాటు సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, దర్శకుడు దశరథ్, మాటల రచయిత అబ్బూరి రవిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.దీంతో దిల్ రాజు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఆయనపై ఐపీసీ సెక్షన్ 420 కింద నమోదైన ఫిర్యాదును హైకోర్టు కొట్టివేసింది. అయితే కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద విచారణ కొనసాగించేందుకు ట్రయల్ కోర్టుకు అనుమతించింది.హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దిల్ రాజు 2025 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాపీరైట్ చట్టం ప్రకారం కేసు దాఖలు చేయడంలో జాప్యం జరిగిందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించింది.తాజాగా ఈ స్టేను ఎత్తివేసి ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని శ్యామలరాణి తరఫు న్యాయవాది కోరారు. ఆమె వయసు 71 సంవత్సరాలని, ఈ కేసును త్వరగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే గతంలో వాదనలు విన్న తర్వాతే స్టే విధించామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతానికి ట్రయల్ కోర్టు విచారణకు బ్రేక్ కొనసాగనుంది.

ఆటో కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్టకట్టలేవు…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు