Homeజాతీయంప్యాకేజీ కాదు.. అసలు పాన్ మసాలానే బ్యాన్ చేయండి!

ప్యాకేజీ కాదు.. అసలు పాన్ మసాలానే బ్యాన్ చేయండి!

పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ వాడకంపై FSSAI నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడం మంచి విషయమే అయినా, అంతకంటే ప్రమాదకరమైన పాన్ మసాలా సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ పాన్ మసాలా కారణంగా మన దేశంలో ఏటా 10 లక్షల మందికి పైగా నోటి క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ప్యాకేజింగ్ కవర్లు మార్చితే సరిపోదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పాన్ మసాలాను పూర్తిగా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.యువతను ఆకర్షించేలా ఉన్న వీటి ప్రకటనలను నిలిపివేసి, పాన్ మసాలా ఉత్పత్తి, అమ్మకాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు.

జనసేనలోకి రాజా సింగ్!

బాలిక గర్భవతి అంటూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్ధారణ.. ప్రైవేట్ పరీక్షల్లో ట్విస్ట్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు