Hometelanganaదేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు

దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు

కూకట్ పల్లి నియోజకవర్గం గాయత్రినగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, V TEAM ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో బోనాల వేడుకలు సంబరంగా జరిగాయి. శ్రీ వివేకానంద నగర్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మస్తాన్ రెడ్డి దంపతులను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం అమ్మవారికి ముక్కులు సమర్పించుకున్నారు. అంతకుముందు మస్తాన్ రెడ్డి నివాసం నుంచి ఆలయం వరకు బోనాల ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. డప్పు వాయిద్యాలతో బాణసంచా కాల్చుతూ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ ముదిరాజ్, ఆది నారాయణ, చెల్లయ్య, రాజా రెడ్డి, సతీష్ రెడ్డి, బొంత రవి, సత్య నారాయణ, జూనియర్ రావు, పద్మారావు, శర్మతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. వీ టీం సభ్యులు రవీందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ తో పాటు సభ్యులు, కాలనీ వాసులు భారీగా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు