ఆధ్యాత్మికత పేరుతో అమాయక మహిళలను మోసం చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ దొంగబాబా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూజలు, దోష నివారణ పేరుతో మహిళలను నమ్మించి వారిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అతడిపై వంద మందికిపైగా మహిళలు బాధితులుగా ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
తాజాగా ఓ హోటల్ గదిలో ఓ మహిళతో కలిసి ఉన్న సమయంలో స్థానికులు అతడిని గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు అక్కడికి చేరుకుని దొంగబాబాపై దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
విచారణలో పూజలు, దోష నివారణ, ఆధ్యాత్మిక పరిహారాల పేరుతో మహిళలను తన వద్దకు రప్పించుకుని మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
also read: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. మైదానంలోనే కుప్పకూలిన యువకుడు
