Homeక్రైమ్క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. మైదానంలోనే కుప్పకూలిన యువకుడు

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. మైదానంలోనే కుప్పకూలిన యువకుడు

రాజస్థాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ యువకుడు అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దౌసా జిల్లాలోని సంలేటి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

స్థానికంగా లభించిన సమాచారం ప్రకారం.. 25 ఏళ్ల రాంరాజ్ మీనా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఆట మధ్యలో ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన స్నేహితులు వెంటనే రాంరాజ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో గుండెపోటు కారణంగానే రాంరాజ్ మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతికి అసలు కారణం వైద్యపరమైన పరీక్షల అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

కాగా, రాంరాజ్ మీనాకు కేవలం ఐదు నెలల క్రితమే వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది నెలలకే అతడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

also read: దారుణం.. సమాధుల్లోని మృతదేహాలను తీసి లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు