Homeక్రైమ్దారుణం.. సమాధుల్లోని మృతదేహాలను తీసి లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు

దారుణం.. సమాధుల్లోని మృతదేహాలను తీసి లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. షేకాన్‌ ప్రాంతంలోని శ్మశానవాటికలో సమాధులను ధ్వంసం చేస్తూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. మృతదేహాలతో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

షేకాన్‌ శ్మశానవాటికలో ఓ బాలిక సమాధిని తెరిచి మృతదేహాన్ని బయటకు తీస్తుండగా 19 ఏళ్ల సల్మాన్‌ను స్థానికులు గుర్తించారు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా, గతంలోనూ పది కంటే ఎక్కువ సమాధులను ధ్వంసం చేసినట్లు సల్మాన్ అంగీకరించినట్లు సమాచారం. మృతదేహాలపై లైంగిక వాంఛలు తీర్చుకున్నట్లు కూడా విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

కాగా, కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని ఘటనాస్థలానికి తీసుకెళ్తుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు సల్మాన్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

నిందితుడిపై కాల్పులు జరిపింది ఎవరు? ఈ ఘటన వెనుక వ్యక్తిగత కారణాలున్నాయా? లేక మరేదైనా వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెషావర్‌లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న మరికొందరు వ్యక్తులు లేదా ముఠాలు ఉన్నాయా అనే అంశంపైనా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

also read: టెక్కలి సమీపంలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు