Homeక్రైమ్టెక్కలి సమీపంలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి

టెక్కలి సమీపంలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. టెక్కలి సమీపంలో రైలు ఢీకొనడంతో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

స్థానికంగా అందిన వివరాల ప్రకారం.. ఐదుగురు యువకులు బహిర్భూమికి వెళ్లారు. అదే సమయంలో రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న వారిని వేగంగా వచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

also read: భర్త హత్యకు స్కెచ్ వేసిన భార్య.. బావతో కలిసి దారుణం.. ఆదోని హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు