Homeక్రైమ్భూ వివాదం బలిగొన్న బంధం.. అన్న చేతిలో తమ్ముడు హతం

భూ వివాదం బలిగొన్న బంధం.. అన్న చేతిలో తమ్ముడు హతం

క్రైమ్ మిర్రర్ : నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదానికి సంబంధించిన పాత గొడవల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అన్న చేతిలో తమ్ముడు మృతి చెందిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన లింబాద్రి (45) ఆదివారం రాత్రి తన కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో పక్క ఇంటి వద్ద అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో లింబాద్రి అక్కడికి వెళ్లి గొడవను సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

అయితే గతంలో ఉన్న భూ వివాదాలకు సంబంధించిన కక్షల నేపథ్యంలో పెద్దోళ్ల బావన్న ఆగ్రహానికి గురై కత్తితో లింబాద్రిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన లింబాద్రిని కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పొలం హద్దు విషయంలో అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

ఘటన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లింబాద్రి మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిని కోల్పోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు లింబాద్రికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై హనుమండ్లు తెలిపారు.
also read : ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా అప్పులు.. చార్టర్డ్ అకౌంటెంట్ బలవన్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు