Homeక్రైమ్ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా అప్పులు.. చార్టర్డ్ అకౌంటెంట్ బలవన్మరణం

ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా అప్పులు.. చార్టర్డ్ అకౌంటెంట్ బలవన్మరణం

క్రైమ్ మిర్రర్ : ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఓ చార్టర్డ్ అకౌంటెంట్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిద్దిపేటలో విషాదం నింపింది. అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. త్రీ టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని మంగమ్మతోటకు చెందిన గుడూరి సంతోష్ (33) చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన ఆన్‌లైన్ గేమ్స్‌లో పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగి అప్పుల పాలైనట్లు పోలీసులు తెలిపారు.

తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష్ సిద్దిపేట శివారులోని ఓ హోటల్‌లో గది తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన స్థలంలో లభించిన లేఖలో తన మరణానికి ఎవరూ కారణం కాదని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి బంధువు వినయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఏసీపీ రవీందర్ రెడ్డి కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆన్‌లైన్ గేమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, నిపుణుల సహాయం తీసుకోవాలని పోలీసులు సూచించారు.
also read : ఇంగ్లిష్ ఛానెల్‌లో మరో విషాదం.. మంటల్లో చిక్కుకున్న బోటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు