మహారాష్ట్రలో వివాహేతర సంబంధం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. షోలాపూర్ జిల్లాలోని మోహోల్ తాలూకాలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మోహోల్ తాలూకాలోని యవలి గ్రామానికి చెందిన సంజయ్ రాజారామ్ రౌత్ (26) అనే యువకుడు రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజుల్లోనే అతనికి తన భార్యకు మరో వ్యక్తితో ప్రేమ సంబంధం ఉందన్న విషయం తెలిసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన తర్వాత దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో భార్యతో పాటు ఆమెకు పరిచయమైన వ్యక్తి సౌరభ్ సదాశివ్ షిండే నుంచి సంజయ్‌పై మానసిక ఒత్తిడి పెరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిరంతరం వేధింపులు ఎదుర్కొన్న సంజయ్ తీవ్ర మనస్థాపానికి గురై చివరికి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
సంజయ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తన కుమారుడి మరణానికి కోడలు, ఆమె ప్రియుడే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సంబంధిత వ్యక్తులను విచారిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
also read: నారా బ్రాహ్మణికి అంతర్జాతీయ గుర్తింపు.. ‘ఫార్చ్యూన్ ఇండియా’ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో స్థానం