HomeసినిమాBhagyashri Borse: రామ్‌తో ప్రేమాయణం.. అసలు విషయం చెప్పేసిన క్యూట్ బ్యూటీ!

Bhagyashri Borse: రామ్‌తో ప్రేమాయణం.. అసలు విషయం చెప్పేసిన క్యూట్ బ్యూటీ!

‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, ఆమె అందం, నటనకు మంచి స్పందన లభించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న భాగ్యశ్రీ, రామ్ పోతినేని సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’ చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమాతో ఆమె తన కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

సినిమాలతో పాటు భాగ్యశ్రీ వ్యక్తిగత జీవితం కూడా గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రామ్ పోతినేనితో ఆమె డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై రామ్ ఇప్పటికే స్పందించి ఖండించగా, భాగ్యశ్రీ మాత్రం ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. ఇటీవల ‘లెనిన్’ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ, “హైదరాబాద్ నా రెండో ఇల్లు” అని ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రత్యేకమైన అనుబంధం ఉందా అనే చర్చ మొదలైంది.

తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీని, తాను కలిసి పనిచేసిన హీరోల్లో ఎవరిని స్నేహితుడిగా, ఎవరితో డేట్‌కు వెళ్లాలనుకుంటారు, ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు అని ప్రశ్నించారు. దీనికి అఖిల్ తనకు మంచి స్నేహితుడని చెప్పిన ఆమె, డేట్, పెళ్లి విషయానికి వస్తే పేరు నేరుగా చెప్పకుండా ఒక హింట్ ఇచ్చింది. “నేను నటించిన హీరోల్లో అందరికీ ఇప్పటికే పెళ్లైంది. ఒక్కరు మాత్రమే ఇంకా సింగిల్‌గా ఉన్నారు” అని చిరునవ్వుతో చెప్పింది. దీంతో ఆమె రామ్ పోతినేనినే ఉద్దేశించి మాట్లాడిందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినవా, లేక నిజంగానే ఏదైనా సంకేతమా అన్న విషయంపై మాత్రం ఇప్పటివరకు రామ్ పోతినేని స్పందించలేదు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు