తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయకగన్’ విడుదల తేదీ ప్రకటించడంతో కోలీవుడ్లో ఒక్కసారిగా హడావుడి నెలకొంది. జూలై 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా, దాని ప్రభావం ఇతర సినిమాలపై స్పష్టంగా కనిపిస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంతో నేరుగా పోటీ పడకుండా ఉండేందుకు నిర్మాతలు తమ ప్లాన్లను మార్చుకుంటున్నారు.
మొదటగా జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘ఇమ్మోర్టల్’ సినిమా జూలై 23న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఆ తేదీని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటించనున్నారు.
ఇక మరోవైపు జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేసిన ‘డీసీ’, ‘సిగ్మా’ సినిమాలు కూడా తమ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘జన నాయకగన్’ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.
అయితే ప్రస్తుతం ‘అన్బే డయానా’ సినిమా మాత్రం జూలై 17న రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంపై ప్రభావం పడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో ‘జన నాయకగన్’పై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. దీంతో ఇతర సినిమాలు రిస్క్ తీసుకోకుండా తమ విడుదల తేదీలను మార్చుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో జూలై చివరి వారంలో తమిళ సినిమా రిలీజ్ క్యాలెండర్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
also read: డబ్బు మొత్తం కూతురికే ఇస్తుందన్న కోపంతో భార్యను హత్య చేసిన భర్త..