హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఎప్పుడూ దర్శకుడిగా, నిర్మాతగా, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈసారి ఆయన దర్శకుడిగా కాదు.. ఏకంగా హీరోగా తెరపై కనిపించనున్నారనే వార్త టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో భారీ చర్చ మొదలైంది.తెలుగు సినీ పరిశ్రమలో శివ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత క్షణక్షణం, గాయం, రాత్రి, అంతం వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అనంతరం బాలీవుడ్‌కు వెళ్లి సత్య, కంపెనీ, సర్కార్, రన్ వంటి చిత్రాలతో గ్యాంగ్‌స్టర్ సినిమాలకు కొత్త దారిని చూపించారు.
Also Read:Nitin Gadkari: ఇథనాల్ ఫ్యూయెల్ తో మైలేజీ తగ్గుతుందా? నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్..
ఇటీవలి కాలంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోయినా, వరుసగా కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కల్కి సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన వర్మ, ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా నటించబోతున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి షో మ్యాన్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మ్యాడ్ మాన్‌స్టర్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read:Supreme Court: జడ్జిలపై కేసు పేపర్లు విసిరిన పిటిషనర్.. సుప్రీంకోర్టులో షాకింగ్ ఇన్సిడెంట్!
ఈ సినిమాతో నూతన్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అందువల్ల హీరోగా రామ్ గోపాల్ వర్మ ఎంట్రీపై వస్తున్న వార్తలను అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రచారంగానే పరిగణించాల్సి ఉంటుంది.