Homeతెలంగాణపార్టీ పేరు మార్పు పై కవిత సంచలన వ్యాఖ్యలు!

పార్టీ పేరు మార్పు పై కవిత సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరు మార్పు అంశంపై పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టమైన వైఖరిని తెలియజేశారు. పార్టీ పేరు మార్చే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. “మా పార్టీ పేరు TRS, కొత్త పేర్లు ఇచ్చేది లేదు” అని ఆమె కుండబద్దలు కొట్టారు.పార్టీ పేరు మార్చుకోవాలని సూచిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రాసిన లేఖకు తాము ఇప్పటికే సమాధానం ఇచ్చామని కవిత వెల్లడించారు. ఈ వ్యవహారంలో తమకు అందిన రెండు అభ్యంతరాలకు సంబంధించి కూడా ఎన్నికల సంఘానికి స్పష్టమైన వివరణ ఇచ్చామన్నారు.తమ పార్టీ పేరును కాపాడుకునేందుకు అవసరమైతే ఎంతవరకైనా వెళ్తామని కవిత హెచ్చరించారు. ఈ అంశంపై న్యాయపోరాటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అమరావతి నేల రాజధానికి పనికిరాదు: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తన సంకల్పం.. 116 ఏళ్ల వయస్సులోనూ ఎంచక్కా తిరుమల కొండ ఎక్కేసింది..!!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు