HomeతెలంగాణBIG BREAKING: బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...!?

BIG BREAKING: బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…!?

  • మంత్రి పదవి రాకుంటే 15 మంది ఎమ్మెల్యేలతో జంప్

  • సీఎం రేవంత్ సభకు డుమ్మా

  • ఢిల్లీలో కొనసాగుతున్న మంత్రాంగం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వార్త హల్చల్ చేస్తోంది. ఓ 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Also Read: మునుగోడులో సరైనోడు.! ఈఎల్వి భాస్కర్

గతంలో బిజెపిలో పని చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఆఫర్ చేయడంతో 2023 ఎన్నికల ముందు చేరారు. అనుకున్నట్టుగానే మునుగోడు నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే గత మూడు సంవత్సరాలుగా మంత్రి పదవి ఊరిస్తూనే ఉంది. మధ్యలో ఓసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. అప్పటినుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

  • సీఎం సభకు గైర్హాజరు..

త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. అందుకే తన వంతు ప్రయత్నాలు చేసేందుకు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ హై కమాండ్ తనను పట్టించుకోకపోతే ప్రత్యామ్నాయ అడుగులు వేసే అవకాశం ఉంది.

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఓ పదిహేను మంది ఎమ్మెల్యేల బృందాన్ని తయారు చేసుకున్నారని.. మంత్రి పదవి ఇవ్వని మరుక్షణం ఆ 15 మందితో బిజెపిలో చేరేందుకు ఒప్పందం చేసుకున్నారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

Also Read: గ్రేటర్ లో గులాబీ రివర్స్ స్కెచ్…! – Crime Mirror

ఈ ప్రచారానికి తగ్గట్టుగానే నల్గొండలో సీఎం రేవంత్ సభకు డుమ్మా కొట్టారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నుంచి కాంగ్రెస్ క్యాడర్ వెళ్లకుండా కూడా నియంత్రించారు. స్వయంగా తన సోదరుడు, మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాఖకు సంబంధించిన కార్యక్రమానికి సైతం రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు కావడం సంచలనంగా మారింది.

  • మంత్రి కావాలన్నది లక్ష్యం..

మంత్రి పదవి చేపట్టాలన్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యం. అయితే క్యాబినెట్లో అతడి సోదరుడు వెంకటరెడ్డి ఉన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికీ మంత్రి పదవులు దక్కే ఛాన్స్ లేదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలంటే కచ్చితంగా వెంకట్ రెడ్డిని తొలగించాలి. కానీ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు.

Also Read: అల్లూరి జిల్లాలో అమానుషం…! బాలిక చేతులపై అట్ల‌కాడ‌తో వాత‌లు… – Crime Mirror

రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. అందుకే ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే మంత్రి పదవి కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు చివరి ప్రయత్నం గా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

  • 15 మంది ఎమ్మెల్యేలతో సిద్ధం..

వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బీజేపీ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని చూస్తోంది తెలంగాణలో. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. అందుకే రాజగోపాల్ రెడ్డి ద్వారా రాజకీయ డ్రామాకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: భారీ వ‌ర్షా సూచ‌న‌..! ఆ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌…! – Crime Mirror

ముఖ్యంగా ఓ 15 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో గోడ దూకేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. 2009లో తొలిసారిగా భువనగిరి నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచారు రాజగోపాల్ రెడ్డి. 2016 నుంచి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా కూడా ఉండేవారు. 2018లో మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బిజెపిలో చేరారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ 2023లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచారు ఎమ్మెల్యేగా. ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే బిజెపిలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Also Read: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పవన్ కళ్యాణ్ భేటీ…! పులుల సంర‌క్ష‌ణ పై చ‌ర్చా…. – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు