Homeతెలంగాణహైడ్రాకు షాక్: కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు సీరియస్

హైడ్రాకు షాక్: కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు సీరియస్

  • తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • ప్రైవేటు ఆస్తిలోకి వెళ్లినందుకు కమిషనర్ రంగనాథ్ పై సీరియస్

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రాకు మరోసారి షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చట్టానికి అతీతం కాదని తేల్చి చెప్పింది. హైడ్రా తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా.. ఇప్పటికే ఆక్రమించిన వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది.

Also Read: జూలై 24న థియేటర్లలోకి కీర్తి సురేష్ ‘సత్యవన్ సావిత్రి’ – Crime Mirror

కానీ కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి హైడ్రాకు. కొన్ని భూములు ప్రభుత్వానికి సంబంధించినవి అని నిరూపించడంలో అధికారులు విఫలం కావడంతో న్యాయస్థానాలు హైడ్రా తీరును తప్పు పడుతున్నాయి. తాజాగా మరో ఘటనలో కూడా హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్తిలో ప్రవేశించినందుకు హైడ్రాక్ కమిషనర్ రంగనాథ్ తీరుపై కోర్టు ఆగ్రహించింది.

  • జరిగింది ఇది..

రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట ప్రాంతంలోని సర్వే నెంబర్ 1, 2 లో ఉన్న భూమికి సంబంధించిన యాజమాన్య స్వాధీన హక్కులను రక్షిస్తూ తెలంగాణ హైకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. శాంతా శ్రీరామ్ అనే నిర్మాణ సంస్థ అది తమకు చెందిన భూమి అని ఆధారాలతో సహా చూపించింది.

దీంతో కోర్టు యాజమాన్య స్వాధీన హక్కులను రక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ భూముల్లోకి హైడ్రా వెళ్ళింది. దీనిపై ఆ నిర్మాణ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేసింది. దానిపై ఈరోజు విచారణ కొనసాగింది. ఆ భూమిలో హైదరాబాద్లో ప్రవేశించి, జోక్యం చేసుకున్నారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

Also Read: ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో వారికే తొలి ప్రాధాన్యత.. మంత్రి పొంగులేటి – Crime Mirror

అయితే ఈ పిటిషన్ పై స్పందించిన హైడ్రా లాయర్.. సొసైటీ టు సేవ్ రాక్స్ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా అధికారులు ఆ స్థలాన్ని సందర్శించినట్లు వివరణ ఇచ్చారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న జడ్జ్… ఆ భూమి తమ దేనిని నిరూపించడంలో హైడ్రా విఫలమైందని తెలిపారు. హైడ్రాధికారులు ప్రైవేటు భూముల్లోకి ప్రవేశించడం న్యాయపరంగా సరైంది కాదని తేల్చి చెప్పారు.

  • తీవ్ర స్థాయిలో తప్పు పట్టిన న్యాయస్థానం..

మరోవైపు హైడ్రా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. హైడ్రా కూడా చట్టానికి అతీతులు కాదని తేల్చి చెప్పింది. పరిపాలన వ్యవస్థలో ఒక భాగమేనని స్పష్టం చేసింది. చట్ట పరిధిని దాటి వ్యవహరించే అధికారం హైడ్రా అధికారులకు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఇకనుంచి ఆ భూమిలోకి ప్రవేశించబోమని హైడ్రా తరుపు లాయర్ కోర్టుకు హామీ ఇవ్వడంతో.. దానిని ఉల్లంఘించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆ భూమి యజమాని హైడ్రా పై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణను హైకోర్టు ముగించింది.

Also Read: మెస్సీని తీసుకువస్తే విమర్శలు చేశారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ – Crime Mirror

Also Read: Breaking: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ వెనుక ఉన్నది వాళ్లేనా…? – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు