Homeతెలంగాణమెస్సీని తీసుకువస్తే విమర్శలు చేశారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

మెస్సీని తీసుకువస్తే విమర్శలు చేశారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువస్తే కొందరు పనిగట్టుకుని విమర్శలు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకే ఆయన్ను తీసుకువచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆరుట్ల సభలో పాల్గొన్న సీఎం రేవంత్.. ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.”మెస్సీ డ్రగ్స్ ముఠా లీడర్ కాదు.. ఆర్థిక నేరగాడు కూడా కాదు,” అని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఇదే వేదికపై గత ప్రభుత్వంపై సీఎం విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం SC, ST, BC, మైనార్టీ వర్గాలకు వేర్వేరుగా కులానికో స్కూల్ ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. కుల వ్యవస్థను రూపుమాపడానికే తమ ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మిస్తోందని ఆయన వివరించారు.క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా త్వరలో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ’ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్!.. వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు రాజీనామా??

కొడుకును హీరోగా లాంచ్ చేయనున్న ధనుష్..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు