Homeఆంధ్ర ప్రదేశ్Breaking: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ వెనుక ఉన్నది వాళ్లేనా...?

Breaking: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ వెనుక ఉన్నది వాళ్లేనా…?

Crime Mirror, AP State Bureau: చిన్నారి జాహ్నవి ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. 12 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలియడం లేదు. దీంతో అనేక అనుమానాలు, అపోహలు నెలకొంటున్నాయి. ఈ ఘటన జరిగిన రోజు నుంచి వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

గ్రామానికి చెందిన ప్రజలతో పాటు సహాయక బృందాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కూడా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది మంది పోలీసులు, అత్యాధునిక డ్రోన్లుతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న ప్రయోజనం లేకపోవడంతో ఏం జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

Also Read: అనిల్ రావిపూడి కి ఇద్దరు హీరోయిన్లు…! – Crime Mirror

ఇప్పటికే తల్లిదండ్రుల మీద కొంత మంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులను ఇంటరాగేట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా పోలీసులు అక్కడే ఉండడం విచారణ ప్రక్రియ చేపడుతుండడంతో వాళ్లే తప్పు చేసి ఉంటే ఇప్పటికే గుర్తించి ఉండేవారని చెబుతున్నారు.

అయితే చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి మాత్రం స్థానికులు పట్ల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చుట్టు పక్కల ఉన్నవాళ్లే ఎవరైనా తీసుకుని వెళ్లి ఉంటారు అన్న భావనను ఆమె వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి జ్ఞానేశ్వరి విషయంలో మరో కీలక మలుపు ఈ కేసు తిరిగినట్టు అయింది.

Also Read: తెలంగాణలో తవ్వే కొద్ది అవినీతి.. ఏసీబీ దాడి చేస్తే వందల కోట్లు పట్టుబట్టాల్సిందే!! – Crime Mirror

అయితే తల్లి అనుమానిస్తున్నట్టుగా ఎవరైనా తీసుకుని వెళ్లి ఉంటే పోలీసులు జాగిలాలు, ఇతర మార్గాల ద్వారా పోలీసులు ఇప్పటికే గుర్తించి ఉండేవారు. అయితే ఈ అనుమానాలు బుట్టదాఖలు అయ్యే అవకాశం ఉంది.

  • అదే జరిగి ఉంటుందా.. జాడ దొరకక పోవడానికి కారణం అదేనా..

రెండేళ్ల జ్ఞానేశ్వర్ కేసులో మరికొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా జంతువులు చిన్నారిని తీసుకుని వెళ్లి ఉంటాయి అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తుని సిఐ ఇదే విషయాన్ని వెల్లడించడంతో ఇప్పుడు ఆ దిశగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిఐ చెన్నకేశవరావు మాట్లాడుతూ కొండచిలువ చిన్నారిని ఎత్తుకొని వెళ్లి ఉంటుందేమో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: డబ్బు అవసరమే ఉండదన్న ప్రపంచ డబ్బున్నోడు ఎలాన్‌ మస్క్‌.. అదే లాజిక్‌ అట.! – Crime Mirror

చిన్నారి దుస్తులు కూడా ఎక్కడ దొరకకపోవడంతో ఇదే కారణమై ఉండవచ్చు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని ఒకవేళ కొండ చిలువ ఏదైనా మింగేసి ఉంటే ఆనవాళ్లు దొరకడం కష్టంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ అభిప్రాయం పట్ల ఫారెస్ట్ అధికారులు మాత్రం సానుకూలతను వ్యక్తం చేయడం లేదు.

ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు జంతువులు వచ్చి మనుషులను తీసుకెళ్లిన ఘటనలు ఎప్పుడో చూడలేదని ఫారెస్ట్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు నమోదు కాలేదని చెబుతున్నారు. అయితే పాప అదృశ్యమైన రోజు భారీ వర్షం పడిన నేపథ్యంలో వరద ప్రవాహానికి కొండ దిగువ ప్రాంతానికి కొట్టుకొని వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగాను పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

Also Read: విడాకుల తర్వాత హన్సిక కొత్త ఆరంభం…! – Crime Mirror

ఇకపోతే రెండేళ్ల చిన్నారి మిస్సై 12 రోజులు కావస్తోంది. దీంతో చిన్నారి ఆకలి బాధను తట్టుకోలేక చనిపోయి ఉండే అవకాశాన్ని కూడా పోలీసులు తోసిపుచ్చడం లేదు. ఇదిలా ఉంటే ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన పెంపుడు కుక్క మృతి వ్యవహారంపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాథమిక విచారణలో డిహైడ్రేషన్ వల్ల కుక్క చనిపోయినట్లు తేలినప్పటికీ.. పూర్తిస్థాయి స్పష్టత కోసం పోస్టుమార్టం నివేదిక కోసం చూస్తున్నారు.

ప్రస్తుతం హనుమాన్ బృందాలు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నాయి. ధర్మల్ కెమెరాలతో కూడిన డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చిన్నారి అదృష్టమైన భావిస్తున్న ప్రాంతంలో చిన్నారి ఆకారంతో కూడిన రెండు బొమ్మలను ఏర్పాటు చేశారు. వాటిలో మాంసాహారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చుట్టు పక్కల ఏవైనా అడవి జంతువులు, కొండచిలువులు ఉంటే మాంసాహార వాసనకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రెకు షాక్!.. షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీలు?? – Crime Mirror

బొమ్మల చుట్టు ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేశారు. మరోవైపు కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే జ్ఞానేశ్వరి తండ్రి స్నేహితులను పోలీసులు పిలిపించి విచారణ సాగిస్తున్నారు. ఏది ఏమైనా 12 రోజులుగా చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ చిన్నారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read: డెంటల్ కాలేజ్ హాస్టల్ లో ర్యాగింగ్ క‌ల‌క‌లం…!ప‌లువురిపై కేసు న‌మోదు… – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు