హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: కోఠి లోని మెడికల్ కాలేజీ హాస్టల్ లో బిడిఎస్ స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు. గత ఆరు నెలలుగా బిడిఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేస్తున్నారని ఉస్మానియా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సర్జీవ్ సింగ్ యాదవ్ అన్నారు. స్విగ్గీ ఆర్డర్స్ కిందకు వెళ్లి తీసుకురావాలని , కులర్ లో వాటర్ నింపాలని , గోడ కుర్చీ వెయిస్తూ వేధింపులకు గురిక్ చేస్తున్నారు. వద్దని వారించినా హౌస్ సర్జన్స్ పై కూడా దాడి చేశారు. ఒకసారి పిలిచి వార్నింగ్ ఇచ్చిన వారిలో మార్పు రాలేదు.
Also Read:డబ్బు అవసరమే ఉండదన్న ప్రపంచ డబ్బున్నోడు ఎలాన్ మస్క్.. అదే లాజిక్ అట.!
అందుకోసమే బిడిఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 12 మందిపై సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి జరిగిన విషయం తెలిపి ఆరు నెలలు సస్పెండ్ కూడా చేశాం. ఉస్మానియా లో ర్యాగింగ్ కు తావులేదు. ర్యాగింగ్ కారణంగా ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. అందుకోసమే వీరిపై ఈ చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం. పోలీసుల రిపోర్ట్ వచ్చాక వీరిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read:అతని కోసమే ఎదురుచూపులు.. పెళ్లి పై శ్రీముఖి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్…!