Homeఆంధ్ర ప్రదేశ్Breaking News: తెలంగాణకు నేడు పవన్ కళ్యాణ్...!

Breaking News: తెలంగాణకు నేడు పవన్ కళ్యాణ్…!

  • హన్మకొండలో వీరాభిమానికి పరామర్శ

  • వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు

  • ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన శ్రేణులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు. హన్మకొండ కు చెందిన తన వీరాభిమాని, జై పరమైన సమస్యతో, ప్రాణాంతక స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిరంజన్ అనే యువకుడిని అవని వ్యక్తిగతంగా పరామర్శించునున్నారు.

సోషల్ మీడియా వేదికగా నిరంజన్ పరిస్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తానే స్వయంగా వచ్చి కలుస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు వచ్చి కలవనున్నారు. పవన్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయింది.

Also Read: అన్నా డీఎంకే కు నటి గౌతమి గుడ్ బై…! – Crime Mirror

  • గతం మాదిరిగానే..

పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా వరంగల్ లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షం కోసం మొక్కులు తీర్చుకొనున్నారు. గతంలో కూడా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం పవన్ కళ్యాణ్ ఒక సెంటిమెంట్ గా పెట్టుకున్నారు.

బుధవారం ఉదయం హన్మకొండకు చేరుకోనున్న డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పర్యటన కేవలం ఒక మానవీయ, ఆధ్యాత్మిక కార్యక్రమంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.

Also Read: ప్రకృతి ఒడిలో దాగిన నిశ్శబ్ద స్వర్గం… ఫుగ్తాల్ మొనాస్టరీ – Crime Mirror

  • ఇటీవల పరిణామాల క్రమంలో..

తెలంగాణలో జనసేన నవనిర్మాణ సంకల్ప సభ పెట్టుకునేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. దీనికి కాంగ్రెస్ నేతల నుంచి ఎదురుదాడి ఎదురయింది. మాటల యుద్ధం కూడా నడిచింది. ఢిల్లీలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన చేసిన వ్యాఖ్యలు గట్టిగానే ఉన్నాయి. త్వరలోను తెలంగాణలో జనసేన ను మరింత క్రియాశీలకం చేస్తామని పవన్ ప్రకటించారు.

ఆ మరుసటి రోజు ఆయన తెలంగాణ గడ్డపై అడుగుపెడుతుండడంతో రకరకాల చర్చ నడుస్తోంది. జనసేన ను తెలంగాణలో యాక్టివ్ చేసేందుకు ఆయన పక్కా రోడ్ మ్యాప్ తో సిద్ధపడుతున్నారని ఊహాగానాలు రేగుతున్నాయి. మొన్నటి పరిణామాలతో తెలంగాణలో జనసేన శ్రేణులు చాలా యాక్టివ్ అయ్యాయి.

అప్పటివరకు సోషల్ మీడియా కే పరిమితమైన ఆ పార్టీ శ్రేణులు తెలంగాణలో జనసేన ను అడ్డుకునే ప్రయత్నాన్ని గట్టిగానే కొట్టాయి. ఇప్పుడు పవన్ హన్మకొండ పర్యటనను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Also Read: తెలంగాణ సిఎస్ గా జయేష్ రంజన్…! – Crime Mirror

Also Read: బొగ్గు చోరీ సాధ్యమేనా…? – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు