Homeసినిమాచిరంజీవి సినిమాపై చెక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్!

చిరంజీవి సినిమాపై చెక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్!

క్రైమ్ మిర్రర్, సినిమా :- మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో వస్తున్నటువంటి విశ్వంభర సినిమాకు గత కొన్ని నెలలుగా అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని క్లిప్స్ లలో విఎఫ్ఎక్స్ అసలు బాగోలేదు అని గతంలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ వెంటనే ఈ సినిమా విఎఫ్ఎక్స్ పై చిత్ర బృందం భారీగానే వర్క్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విశ్వంభర మూవీ రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో న్యూస్ వేగంగా పాకుకుపోతుంది. అయితే ఇదే విషయాన్ని ఒక సినిమా జర్నలిస్ట్ రెండు భాగాలుగా వస్తుంది అని ట్విట్ చేయగా దానికి స్పందించిన డైరెక్టర్ వశిష్ట “అవునా.. నిజమా” అంటూ కామెంట్ చేశారు. ఈ విషయంపై డైరెక్టర్ చేసిన కామెంట్స్ చూసుకుంటే రెండు భాగాలుగా లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు క్లారిటీ లేదు కాబట్టి ఈ సినిమా రెండు భాగాలుగా కూడా రావచ్చు అని కొంతమంది సినిమా విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం చిత్ర బృందం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు.

వందమంది ఫైటర్స్ తో ప్రభాస్ ఫైటింగ్ సీన్!

Money Astrology: ఈ ఒక్క పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు