క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే స్పిరిట్ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ ప్రతి ఒక్కరి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి ఒక వార్త అయితే సెన్సేషన్ సృష్టిస్తుంది. వందమంది ఫైటర్స్ తో రెబల్ స్టార్ ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం. ఈ వంద మంది ఫైటర్స్ తో ప్రభాస్ ఫైటింగ్ చేయడానికి భారీ స్థాయిలో రిహార్సల్స్ చేస్తున్నారు అని సమాచారం. ఏ సినిమాలో లేని విధంగా ఈసారి కొత్తగా ఈ స్పిరిట్ సినిమాలో ఫైటింగ్స్ అదిరిపోతాయి అని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ద్వారా యాక్షన్ మీల్స్ అందించడానికి సందీప్ రెడ్డి వంగ విస్తృతస్థాయిలో సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ఫైటింగ్ కోసం ప్రభాస్ రిహార్సల్స్ చేస్తుండగా మరో వారంలో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటారు అని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు అభిమానుల్లో నెలకొండగా.. ఎంత ఆలస్యమైనా పర్లేదు ప్రభాస్ హిట్ కొట్టాల్సిందే అని అంటున్నారు. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన వేసవికాలంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Money Astrology: ఈ ఒక్క పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది!
మ్యాక్‌బుక్‌కు పోటీగా గూగుల్‌బుక్.. స్పెషల్ ఏంటంటే..?