-
పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటరా….!
-
ఇక్కడి దరిద్రం పోయేదాకా పనిచేస్తూనే ఉంటా
-
కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప.. అభివృద్ధి లేదు
-
ఓట్లేసే ముందు ఆలోచించండని అప్పుడే చెప్పాను
-
తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు
-
భూముల ధరలు అప్పుడెలా ఉండేవి? ఇప్పుడెలా ఉన్నాయి
-
రైతుబంధుకు రాం రాం…
జగిత్యాల, క్రైమ్ మిర్రర్: జీవన్ రెడ్డి ఒక ప్రబలశక్తి గల వ్యక్తి. తెలంగాణ రాష్ర్టం అభివృద్ది, భశిష్యత్ కోసం అందరినీ సమీకరించి సైన్యంలా బీఆర్ ఎస్‌లో చేరారు. జీవన్ రెడ్డి నేను నాలుగు దశాబ్దాలుగా స్నేహితులం. చాలా కాలం ఇద్దరం కలిసి పని చేశాను. ఈ ప్రాంతం కోసం పాటుపడ్డ జీవన్ రెడ్డి ఎందరికో ఆదర్శం. జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా.. ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోనూ జీవన్‌రెడ్డి ప్రభావం ఉంటుంది. జగిత్యాలను, కరీంనగర్‌ను ఇక్కడివారు చూసుకోవాలి. జీవన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి. ఆయన్ను బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా
కేసీఆర్ చావాలని కోరుకుంటున్నరు…
పొద్దున లేస్తే.. కేసీఆర్ చావాలె అంటరు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా! పిల్లి శాపానికి ఉట్టి తెగిపడతదా? ఈ వెధవలు చావాలంటే కేసీఆర్ చస్తడా? నాకు 72 ఏళ్లు వచ్చాయి.. జీవన్‌రెడ్డికి అంతకన్నా ఎక్కువ. మీ దీవెనలు మాకుంటే.. వయోభారం ఉన్నా సరే రాష్ట్రం కోసం పనిచేస్తాం.
ఇక్కడి దరిద్రం పోయేవరకు, ఇది మా తెలంగాణ.. మేం గర్వంగా బతుకుతామని అన్నివర్గాల ప్రజలు మంచిగా బతికేదాకా చివరి శ్వాస వరకు పనిచేస్తూ దూసుకుపోదాం. జగిత్యాల యుద్ధం మీ వంతు.. తెలంగాణ యుద్ధం మా వంతు’’ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ స్కామ్‌లే తప్ప.. ఎటువంటి అభివృద్ధి లేదని, అన్ని వర్గాలనూ మోసం చేశారని ఆరోపించారు.
బీఆర్ ఎస్ పాలనలో 24 గంటల కరెంటు…
బీఆర్‌ఎస్ పాలనలో మిషన్ భగీరథను ఐదేళ్లలో పూర్తిచేసి.. ప్రతి గ్రామానికీ, మారుమూల తండాలు, పల్లెలకు తాగునీరు అందించామని, ఇప్పుడెందుకు నీళ్లు రావడంలేదని ప్రశ్నించారు. ‘‘ఏడాదిలోపు 24 గంటలు కరెంటు ఇచ్చినం. ఈ దరిద్రులకు రాజ్యాన్ని అప్పగించే ముందు 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను తెచ్చాం. అలాంటిది.. ఇప్పుడేమైంది? ఓట్లేసేటప్పుడు ఆలోచించమని చిలకలకు చెప్పినట్లు చెప్పిన. కొందరు విన్నరు.. కొందరు వినలేదు. ఇప్పుడు తప్పు చేశామని బాధపడుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ 1.7 శాతం ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి పాలైందని కేసీఆర్ అన్నారు. ఏం పరిపాలన చేస్తరో చెయ్యనీ, వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని తాను మాట్లాడలేదని, బయటకు రాకుండా ఊరుకున్నానని తెలిపారు. ఈ పాలకులు ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప.. ఒక్కటైనా గొప్ప స్కీమ్ తెచ్చారా? అని ప్రశ్నించారు. అన్నింటా తెలంగాణను నంబర్‌వన్‌లో నిలిపామని, అలాంటి రాష్ట్రం ఇప్పుడేమైందని అన్నారు.
హైడ్రాను తీసేస్తాం…
కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన హైడ్రాను తీసుకువచ్చిందని కేసీఆర్ మండిపడ్డారు. ఆ పేరుతో భూములను కబ్జా పెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, రాగానే హైడ్రాను ఎత్తివేస్తామని, మొదటి సంతకం దానిపైనే చేస్తామని ప్రకటించారు. మూసీ వెంట ఉన్న గరీబోళ్లను కాంగ్రెస్ సర్కారు ఏడిపిస్తోందని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు అయ్యేది కాదన్నారు. ఎటు చూసినా దోపిడీ, గూండాగిరి, అరాచకత్వంతో కాంగ్రెస్ వెళుతోందని దుయ్యబట్టారు. ప్రజాసంక్షేమం లేదని, ఇరిగేషన్ ప్రాజెక్టులను పండబెట్టారని ధ్వజమెత్తారు. తమ హయంలో కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కారు ఒత్తిడి తీసుకువచ్చినా.. మీటర్లు పెట్టలేదని కేసీఆర్ తెలిపారు.
జీవన్ రెడ్డి ప్రబలశక్తి..!
‘‘జీవన్‌రెడ్డి గుండె ధైర్యం ఉన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ సైన్యంలా వెంట తీసుకొని బీఆర్‌ఎస్‌లో చేరారు. జీవన్‌రెడ్డి, నేను 40 ఏళ్లుగా స్నేహితులం. చాలాకాలం ఇద్దరం కలిసి పనిచేశాం. తన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ ఆయన ఎందరికో ఆదర్శం’’ అని కేసీఆర్ అన్నారు. జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా.. ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోనూ జీవన్‌రెడ్డి ప్రభావం ఉంటుందని తెలిపారు. జగిత్యాలను, కరీంనగర్‌ను ఇక్కడివారు చూసుకోవాలని, జీవన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని ఆకాంక్షించారు.