Tuesday, March 24, 2026
Homeఆంధ్ర ప్రదేశ్పెద్దిరెడ్డి పై బ్రహ్మాస్త్రం...!

పెద్దిరెడ్డి పై బ్రహ్మాస్త్రం…!

  • నల్లారి కుటుంబంతో కలిసి చంద్రబాబు నయా స్కెచ్

  • పుంగనూరు బరిలో సినీ నటుడు నారా రోహిత్

  • వచ్చే ఎన్నికల్లో ఆ ఫ్యామిలీకి చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ అపర చాణుక్యుడు. ఆయన వ్యూహం పన్నారు అంటే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన వ్యూహాలను అమలు చేయగల నేర్పరి. ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు.

ఈ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చురగొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారు. ప్రజల ఆమోదయోగ్యంతో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే తన సొంత జిల్లా చిత్తూరులో మాత్రం పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయారు.

ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించలేకపోయారు. అయితే ఇప్పుడు నల్లారి కుటుంబంతో కలిసి పెద్దిరెడ్డి ఫ్యామిలీని చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేక ఆలోచనతో ఉన్నారు. అక్కడ సరైన అభ్యర్థిని ఎంపిక చేసినట్లు ప్రచారంలో ఉంది.

నల్లారి కుటుంబంతో విభేదాలు..
పుంగనూరు నుంచి సుదీర్ఘకాలం రాజకీయాలు చేస్తూ వచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డితో రాజకీయ వైరం ఉంది. అదే వైరం కిరణ్ కుమార్ రెడ్డితో కొనసాగుతూ వచ్చింది. మరోవైపు చంద్రబాబుతో సైతం ఆ రెండు కుటుంబాలకు వైరం ఉంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో నల్లారి ఫ్యామిలీ చంద్రబాబుకు అనుకూలంగా మారింది.

కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సైతం బిజెపి తరఫున మొన్న రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు చంద్రబాబుతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవాకు చెక్ పెట్టాలని గట్టి ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

ఫ్యామిలీ హవా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి.. ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె నుంచి.. కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలుస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

ముఖ్యంగా జిల్లాల విభజనలో పుంగనూరు నియోజకవర్గాన్ని అడ్డగోలుగా చీల్చింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఆ రెండు నియోజకవర్గాలను ముక్కలు చేయాలని భావిస్తోంది. మరోవైపు భూముల ఆక్రమణ కేసులు పెద్దిరెడ్డిని వెంటాడుతున్నాయి. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.

గట్టి అభ్యర్థి..
అయితే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవాకు చెక్ చెప్పాలంటే గట్టి అభ్యర్థి అవసరం. ఈ నేపథ్యంలో నారా కుటుంబం నుంచి ఒకరిని బరిలో దించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ తో అక్కడ పోటీ చేయిస్తారని తెలుస్తోంది.

ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తూ నారా రోహిత్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో నారా రోహిత్ పేరును పుంగనూరు అభ్యర్థిగా ప్రకటించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయిస్తారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం నడుస్తోంది. నల్లారి కుటుంబంతో కలిసి నారా చంద్రబాబు గట్టి స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments