Homeక్రైమ్పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్.. చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్.. చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెక్ బౌన్స్ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. రూ.34.23 లక్షల విలువైన చెక్‌కు సంబంధించిన కేసులో నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది.

కోర్టు వివరాల ప్రకారం.. ఖాతాలో తగినంత నగదు నిల్వ లేకపోయినప్పటికీ రోహిత్ రెడ్డి చెక్ జారీ చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం ఆ చెక్ బ్యాంకులో సమర్పించగా నగదు లేకపోవడంతో బౌన్స్ అయినట్లు కోర్టు గుర్తించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కోర్టు ఎదుట హాజరైన తర్వాత లేదా పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం శిక్షపై నిర్ణయం తీసుకోనున్నారు. రూ.34.23 లక్షల చెక్ బౌన్స్ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

also read: కెనడాలో భారతీయ యువతి హత్య.. ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు