HomeUncategorizedవణుకుతున్న ఉత్తరాంధ్ర...! దూసుకొస్తున్న వాయుగుండం...

వణుకుతున్న ఉత్తరాంధ్ర…! దూసుకొస్తున్న వాయుగుండం…

  • ఈ అర్ధరాత్రి దాటిన తరువాత తీరం దాటే అవకాశం

  • శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు

  • జనజీవనం అస్తవ్యస్తం

 

 

క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం అయింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది.. ప్రస్తుతం ఈ తీవ్రవాయుగుండం గోపాల్ పూర్కు 150 కిలోమీటర్లు, కళింగ పట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిస్సా లోని పూరికి 220 కిలోమీటర్లు, విశాఖకు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈరోజు రాత్రి కి తీవ్ర వాయుగుండంగా మారి.. విశాఖ- గోపాల్ పూర్ మధ్య తీరాలను దాటి అవకాశం ఉంది. ఈ ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయి. అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది.

రైల్వే సర్వీసులు రద్దు…

మరోవైపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ అప్రమత్తం అయింది. కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి కిరోండాల్ వెళ్లే రైలును రద్దు చేసింది. అలాగే గురువారం కిరోండాల్ నుంచి రావాల్సిన రైలును సైతం రద్దు చేసింది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. కాగా తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వం అలెర్ట్ …

ఈనెల 26 వరకు భారీ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల యంత్రాంగాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎటువంటి విపత్కర పరిస్థితి నైనా ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష చేశారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు కూలిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులకు భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లాలో 11 తీర ప్రాంతాల్లో సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు అత్యవసర వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. రష్యా చమురు కొనుగోళ్ల నిలుపుదల అసాధ్యం: నిర్మల సీతారామన్
  2.  ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. అత్యవసర టోల్ ఫ్రీ నంబర్లు జారీ!
  3. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ.. సీఈసీ అరెస్ట్, మళ్లీ ఎన్నికలకు మమతా బెనర్జీ డిమాండ్!
  4.  గోవా తీరంలో ఐపీఎల్ వేలం హంగామా: ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఆటగాళ్ల ఆక్షన్!

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు