క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ తన భవిష్యత్ రాజకీయ వ్యూహం పై గట్టి ఆలోచన చేస్తున్నారు. ఈ దేశానికి వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. మొన్ననే గుజరాత్ సీఎంగా, ఈ దేశ ప్రధానిగా 25 సంవత్సరాల ను పూర్తి చేసుకున్న మోడీ.. తన భవిష్యత్తు రాజకీయ వ్యూహాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రిమండలి రెండు రోజులపాటు అత్యంత కీలకమైన మేథో మధన సదస్సు నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం వేదికగా బుధవారం ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు పాల్గొంటున్నారు. వికసిత్ భారత్ రోడ్డు మ్యాప్ లో భాగంగా ఇప్పటివరకు సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన తదుపరి సంస్కరణలు, పాలనా ప్రాధాన్యతలను ఖరారు చేయడమే ఈ సమావేశం ప్రధాన అజెండాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
నాలుగు అంశాలపై దిశా నిర్దేశం.. .
ప్రధానంగా ప్రధానమంత్రి నాలుగు కీలక అంశాలపై మంత్రులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పథకాల అమలులో వేగం పెంచడం, మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గత సమన్వయం, శాఖా పరమైన అవరోధాలు తొలగించడం, సాధారణ ప్రజలకు జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడం. మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారని అంశంపై మంత్రుల కమ్యూనికేషన్ వ్యూహాలు, డిజిటల్, సోషల్ మీడియా, ప్రజా సమస్యల పరిష్కార నివేదికలపై మంత్రుల పనితీరును ప్రధాని సమీక్షించనున్నారు.
నాలుగు గ్రూపులుగా…
ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ఈ శిబిరం కోసం కేంద్ర మంత్రులను నాలుగు ప్రధాన గ్రూపులుగా విభజించారు. హరదీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్ పంటి సీనియర్ మంత్రుల నేతృత్వంలో ఈ బృందాలు.. ప్రభుత్వ సంస్కరణలు, టెక్నాలజీ ఆధారిత పాలన, యువత భాగస్వామ్యం పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇస్తున్నాయి. స్వతంత్ర ఉద్యమం తరహాలోనే వికసిత్ భారత్‌ను ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కాకుండా.. ప్రజా ఉద్యమంగా ఎలా మార్చాలనే దానిపై మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలో మారుతున్న జనాభా తీర్పు అనుగుణంగా సీనియర్ సిటిజన్లను మెంటార్ షిప్ కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయడం, విశ్వవిద్యాలయాల్లోని యువతను దేశాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించడం వంటి చర్చలు సాగుతున్నాయి. అయితే దీనిని కేవలం సాంకేతిక పరమైన ఆలోచనతో చూడలేం. కచ్చితంగా రాజకీయ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడ చదవండి:
