భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గర్వకారణమైన విజయాలను అందించిన ప్రముఖ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్ చేశారు. ఇటీవలే ముగిసిన ఏషియన్ గేమ్స్‌లో వెండి పతకం సాధించి సత్తా చాటిన ఆమె, తనకు ప్రతిష్టాత్మకమైన ‘అర్జున అవార్డు’ను అందించాలని కోరారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మీరాబాయ్ చాను తన మనసులోని మాటను పంచుకుంటూ, “అర్జున అవార్డు అనేది ప్రతి క్రీడాకారుడికి ఎంతో గొప్ప మరియు అత్యంత గౌరవప్రదమైన పురస్కారం. నా వద్ద ప్రస్తుతం ఈ అవార్డు లేదు, అందుకే దీనిని పొందాలని నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నా క్రీడా ప్రదర్శనలు, అంతర్జాతీయ విజయాలను గుర్తించి ఈ అవార్డును బహుకరిస్తే నేను చాలా సంతోషిస్తాను” అని వెల్లడించారు.
అయితే, మీరాబాయ్ చాను చేసిన ఈ అభ్యర్థన నెరవేరడంపై సాంకేతిక నిబంధనల చిక్కులు ఉన్నాయి. క్రీడా పురస్కారాల అధికారుల వివరాల ప్రకారం, ఇప్పటికే దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్ రత్న’ అందుకారించిన క్రీడాకారులను, దాని తర్వాత స్థానంలో ఉండే ‘అర్జున అవార్డు’కు నామినేట్ చేయడం కుదరదు. మీరాబాయ్ చాను ఇప్పటికే దేశ అత్యున్నత ఖేల్ రత్న పురస్కారాన్ని స్వీకరించినందున, సాంకేతిక కారణాల దృష్ట్యా ఆమెకు సెకండ్ బెస్ట్ అవార్డు అయిన అర్జున అవార్డు ఇచ్చే అవకాశం లేదని సమాచారం.
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. ‘SIR’పై విచారణకు సీఎం స్టాలిన్ సంచలన డిమాండ్!
