క్రైమ్ మిర్రర్, సినిమా:- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల కలిసి ఓ డిఫరెంట్ మూవీ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. సాధారణ ప్రేమకథకు భిన్నంగా డార్క్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్లు ఒకే హీరోను ప్రేమించే కాన్సెప్ట్‌తో కథ సాగుతుందని టాక్ వినిపిస్తోంది.ఈ అన్‌టైటిల్డ్ సినిమాకు ఉమేష్ బిష్ట్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. గతంలో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించిన ఆయన ఈసారి జాన్వీ కపూర్, శ్రీలీలను పూర్తిగా భిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నట్లు సమాచారం. ఇద్దరి పాత్రలకు కూడా కథలో సమానమైన ప్రాధాన్యత ఉంటుందని టాక్.ఈ సినిమాలో హీరో పాత్ర ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ సరైన నటుడి కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిని ప్రేమిస్తారట. మొదట ప్రేమగా మొదలయ్యే ఈ బంధం క్రమంగా అబ్సెషన్‌గా మారుతుందని ప్రచారం జరుగుతోంది. హీరోను సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయని తెలుస్తోంది.
యశస్వి జైస్వాల్‌తో డేటింగ్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్
ఇక కథలో ఊహించని క్రైమ్ అంశాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు ఉండటంతో ఇది సాధారణ రొమాంటిక్ మూవీగా కాకుండా డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండనుందని సమాచారం. జాన్వీ, శ్రీలీల ఇద్దరికీ తమ నటనా ప్రతిభను చూపించేందుకు ఈ సినిమా మంచి అవకాశం అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ ప్రాజెక్ట్‌ను ఏక్తా కపూర్, గునీత్ మోంగా కపూర్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.శ్రీలీల విషయానికి వస్తే.. చాలాకాలంగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు జాన్వీ కపూర్‌తో కలిసి ఇలాంటి డిఫరెంట్ జానర్ సినిమాలో నటించే అవకాశం లభిస్తే ఆమె కెరీర్‌కు ఇది కీలకమైన ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.
మరోవైపు జాన్వీ కపూర్ కూడా వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తూ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీలతో కలిసి డార్క్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చేయబోతున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే సినిమా, హీరో, టైటిల్, షూటింగ్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. త్వరలో డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాల్సి రావొచ్చా?
