Homeక్రైమ్దేవరకొండలో వీధి కుక్కల దాడి.. మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు

దేవరకొండలో వీధి కుక్కల దాడి.. మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు

దేవరకొండ పట్టణంలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. మగ్దుంబాబా నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఆడుకుంటున్న మూడేళ్ల బాలిక నబియాపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి.

కుక్కలు చిన్నారిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

బాలికపై వీధి కుక్కలు దాడి చేయడంతో మగ్దుంబాబా నగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో కుక్కల బెడద పెరుగుతోందని, అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

also read: ఇద్దరు భార్యల మధ్య గొడవ: ఒకరి మృతి, భయంతో మరొకరి ఆత్మహత్య

తాజావార్తలు