చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన టార్చ్ ఫెస్టివల్ వేడుకల్లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. జియాన్వెన్ ప్రాంతంలో కాగడాలు వెలిగించే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయిల్‌తో ఉన్న ఓ కంటెయినర్ ప్రమాదవశాత్తు కిందపడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ఆ సమయంలో సమీపంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారింది. మంటలు చుట్టుముట్టడంతో పలువురు అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. కొంతమంది మంటల్లో చిక్కుకోవడంతో సహాయం కోసం కేకలు వేస్తూ కనిపించడం కలచివేసింది.
ఈ ఘటనలో మొత్తం 16 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేడుకల్లో భద్రతా ఏర్పాట్లపై ఈ ప్రమాదం మరోసారి ఆందోళనకు దారితీసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
also read: దేవరకొండలో వీధి కుక్కల దాడి.. మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు
