క్రైమ్ మిర్రర్ : బాలీవుడ్‌కు చెందిన సీనియర్ దర్శకుడు షకీల్ నూరానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2016లో లోఖండ్‌వాలాలో నిర్వహించిన ఓ అవార్డు కార్యక్రమంలో ఆమెకు షకీల్ నూరానీతో పరిచయం ఏర్పడింది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పిన ఆయన.. కొంతకాలం తర్వాత ఓ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ రీడింగ్ కోసం మాల్వానిలోని తన ఇంటికి రావాలని ఆమెను కోరినట్లు తెలిపారు.
ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో కూల్‌డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. అది తాగిన తర్వాత తాను స్పృహ కోల్పోయినట్లు తెలిపింది. ఆ సమయంలో తనపై అత్యాచారం చేసి, ఆ ఘటనను వీడియోలో చిత్రీకరించినట్లు వివరించింది. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని తనను బెదిరించడం ప్రారంభించారని, ఈ విషయం పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని హెచ్చరించినట్లు బాధితురాలు తెలిపింది. అనంతరం కూడా పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులు మరింత తీవ్రం కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శనివారం తెల్లవారుజామున షకీల్ నూరానీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొరివలి హాలిడే కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు షకీల్ నూరానీకి ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం పోలీసులు ఆరోపణలకు సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
also read : విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
