Monday, March 16, 2026
Homeక్రీడలుచాలా దారుణ స్థితిలో మా టీం ఉంది : మాజీ క్రికెటర్

చాలా దారుణ స్థితిలో మా టీం ఉంది : మాజీ క్రికెటర్

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- తాజాగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగినటువంటి వన్డే సిరీస్ లో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.అయితే ఈ విషయంపై తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మాల్ తన పాకిస్తాన్ జట్టుపై సెటైర్ల వర్షం కురిపించారు. నెదర్లాండ్స్ సైతం పాకిస్తాన్ పై గెలిచి టెస్ట్ హోదాను దక్కించుకోవాలని చూస్తోంది అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా దారుణ స్థితిలో ఉంది అంటూ పాకిస్తాన్ జట్టుపై విమర్శలు గుర్తించారు. ఆసియా కప్ లో భారత్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ నక్వి ట్రోఫీ ని భారత్ కు అందించకపోవడంపై కూడా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర జట్లను ఓడించడం చేతకాక ఐసీసీ ట్రోఫీలను దొంగలిస్తారా అంటూ తన దేశం జట్టుపైనే విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక మాజీ క్రికెటర్ ఆ దేశం పైనే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై చర్చిస్తూ నవ్వులు పూజిస్తున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న జట్టుపై ఆ దేశ క్రికెటర్ ఏ మళ్లీ సెటైర్లు వేస్తూ ఉండడంతో ఆ ప్లేయర్లకు మరింత చేదు అనుభవం ఎదురయ్యింది. గెలవడం చేతకాదు కానీ అన్నిట్లో తలదూరుస్తారు అని పాకిస్తాన్ పై ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.

Cleanup Initiative: కార్పొరేటర్ దీప్లా నాయక్ ఆధ్వర్యంలో కంప చెట్ల తొలగింపు!

Indian Warships: హోర్ముజ్ మార్గంలో ఉద్రిక్తతలు.. భారత వాణిజ్య నౌకలకు నేవీ కాపలా!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments