Homeక్రీడలునా ఆట నా ఇష్టం అంటున్న సంజు శాంసన్!

నా ఆట నా ఇష్టం అంటున్న సంజు శాంసన్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- తనకు నచ్చినట్లుగా ఆడాలని, తన శైలిని మార్చుకోనని టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ స్పష్టం చేశాడు. 2026 టీ20 వరల్డ్ కప్ ముందే తాను ఒక నిర్ణయానికి వచ్చానని, ఇతరుల అభిప్రాయాలను, విమర్శలను పట్టించుకోనని ఆయన తేల్చి చెప్పాడు. ఇటీవల ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.క్రికెట్‌లో పోటీ గురించి మాట్లాడుతూ, ‘ర్యాట్ రేస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అందులో భాగం కావాలని నేను అనుకోవడం లేదు. నేను ఎలా బ్యాటింగ్ చేయాలి, నా ఆటతీరు ఎలా ఉండాలి అనేది వేరే వాళ్లు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. ఒక మంచి టీమ్‌మేట్‌గా జట్టుకు ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది. అవసరమైనప్పుడు జట్టు విజయానికి నా వంతు కృషి చేస్తాను’ అని సంజూ అన్నాడు.తన భవిష్యత్ ప్రణాళికల గురించి స్పందిస్తూ, ‘నిజం చెప్పాలంటే 2026 టీ20 వరల్డ్ కప్ ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదు. అది అనుకోకుండా జరిగింది. అలాంటిది 2028 వరల్డ్ కప్ గురించి ఇప్పుడే ఎలా చెప్పగలను? భవిష్యత్తు గురించి ఆలోచించడం నా చేతుల్లో లేదు. జట్టుకు నా అవసరం ఉంటే, నా ఫిట్‌నెస్ సహకరిస్తే, అన్నీ అనుకూలిస్తే భవిష్యత్తులో కూడా ఆడతానేమో. ప్రస్తుతానికి అయితే నా ఆటను నేను ఆస్వాదిస్తున్నాను’ అని సంజూ శాంసన్ వివరించాడు. తనదైన రోజున బంతిని బౌండరీకి తరలించే ఈ ఆటగాడి వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

దేశంలోని టాప్ 10 రిచెస్ట్ సీఎంల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

కరూర్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు.. విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు షాక్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు