చెన్నై, క్రైమ్‌మిర్రర్: తమిళ చిత్రసీమలో స్టార్ హీరోల రాజకీయ అరంగేట్రం కొత్తేమీ కాదు. MGR, జయలలిత కాలం నుంచి నేటి విజయ్ వరకు ఎంతోమంది కోలీవుడ్ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఇదే బాటలో ధనుష్ కూడా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి.తాజాగా తన అభిమానులు నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో కాకరేపుతున్నాయి. తన ఫ్యాన్ బేస్‌ను ప్రత్యక్ష రాజకీయాల వైపు మళ్లించేందుకే ఆయన ఈ ప్లాన్ వేస్తున్నారనే చర్చ మొదలైంది.అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడూతూ.. ఇంతమంది ఒకే చోట కలవడం చిన్న విషయం కాదు. మీ ఐక్యతలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిని కేవలం సినిమా వేడుకలకు, ఆడియో లాంచ్‌లకే పరిమితం చేయకండి.
Also Read:అరుదైన వ్యాధిపై విజయం: 11 నెలల చికిత్సతో యువకుడికి కొత్త జీవితం
ఆ బలాన్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించండి. మీ మీ ప్రాంతాల్లోని ప్రజల కష్టాలను, వారి అవసరాలను తెలుసుకుని సహాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను గర్వపడేలా మీ ఆర్గనైజేషన్ పనిచేయాలి అని పిలుపునిచ్చారు. పైకి ఇది కేవలం సేవా కార్యక్రమాల పిలుపులా కనిపించినా.. దీని వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందనేది పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం. గతంలో విజయ్ కూడా అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాల్లోకి దించి, ఆ తర్వాతే తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రకటించారు.ఇప్పుడు ధనుష్ కూడా తన అభిమాన సంఘాలను గ్రౌండ్ లెవల్లో ప్రజలకు దగ్గర చేయడం చూస్తుంటే.. ఆయన కూడా సైలెంట్‌గా భవిష్యత్ రాజకీయాలకు పునాదులు వేసుకుంటున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది.సినిమాల్లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటూనే, మరోవైపు ధనుష్ వేస్తున్న ఈ పొలిటికల్ అడుగులు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read:రామాయణ ట్రైలర్ లాంచ్ వాయిదా.. అభిమానుల్లో మరింత పెరిగిన ఆసక్తి
