Homeక్రైమ్డ్యాన్స్ షో విజేత రాజు అరెస్ట్

డ్యాన్స్ షో విజేత రాజు అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన డీ-10 డ్యాన్స్‌ షో విజేత రాజును హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేయడంతో పాటు, లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 9న మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో అతడిని రిమాండ్‌కు తరలించారు.

అయితే రాజుపై కేసు నమోదైన విషయం కొంతకాలం వరకు పోలీసులు బయటకు వెల్లడించకపోవడం చర్చకు దారితీసింది. తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో డ్యాన్స్‌ షో వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

మరోవైపు, యువతి చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : హైదరాబాదులో ఈడీ దాడులు…!

తాజావార్తలు