Homeఆంధ్ర ప్రదేశ్Crime Mirror Special Story:“నాన్న జ్ఞాపకాలే మిగిలాయి… కానీ ఆ ప్రేమ తిరిగి రాదు.”

Crime Mirror Special Story:“నాన్న జ్ఞాపకాలే మిగిలాయి… కానీ ఆ ప్రేమ తిరిగి రాదు.”

“నాన్న జ్ఞాపకాలే మిగిలాయి… కానీ ఆ ప్రేమ మాత్రం తిరిగి రాదు.”

నాన్న కోసం నా మాట…సీనియర్ జర్నలిస్ట్ పానుగుండ్ల హరి

నాన్న చనిపోయిన రోజు…

మా ఇంటిని చీకట్లు కమ్ముకున్న క్షణం.

మా జీవితపు పుస్తకంలో నలిగిపోయిన ఒక బాధాకరమైన పేజీ.

“నాన్న చనిపోయారు” అన్న మాట వినగానే

ఒక్కసారిగా కాలమే ఆగిపోయినట్టు అనిపించింది.

నా ఊపిరి తుఫాను గాలిలా చెవుల్లో వినిపించింది.

కన్నీళ్లు కళ్లను నింపి చూపే మసకబార్చాయి.

ఎందుకో తెలియని ఒక భయం

చల్లని గాలిలో కూడా చెమటలు పట్టేలా చేసింది.

చిన్నప్పటి నుంచి నేను చూసిన నాన్న…

ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించేవాడు.

భయం లేకుండా ధైర్యంగా ఉండేవాడు.

అందరికంటే బలమైన మనిషిలా అనిపించేవాడు.

అలాంటి నాన్న…

ఇప్పుడు కదలికలేకుండా కళ్ళు మూసుకుని పడి ఉండటం చూసి

మనసు చలించిపోయింది.

ఏడుపు ఆపుకోలేక

“నాన్న… నాన్న…” అని ప్రాణంలేని ఆయన దేహంపై వాలిపోయి

గట్టిగా ఏడ్చేశాను.

మా అమ్మ చేతిలో ఉన్న రెండో మూడో గాజులు కూడా

ఒక్కొక్కటిగా పగలగొట్టారు.

నుదుటి బొట్టు చెరిపేసి

తెల్లని చీర కట్టి,

ఆ చీర కొంగుతో తలను కప్పుకుని

ఎవరికీ కనిపించకుండా ఇంటికి తీసుకువచ్చిన ఆ క్షణం…

ఆ దృశ్యం చూసి

ఇప్పటికే ఏడ్చి కమిలిపోయిన నా కళ్లలోనుంచి

మరింత బాధ ఉప్పొంగింది.

ఆ బాధను మాటల్లో చెప్పడం అసాధ్యం.

ఏదేమైనా…

అమ్మానాన్న ఉన్నప్పుడు జీవితం ఎంత అందంగా ఉంటుంది.

ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు

ఆకాశంలోని చుక్కల్లా రాలిపోతే…

ఆ తర్వాతి జీవితం

దుఃఖంతో నిండిన

తెగిపోయిన గాలిపటం లాంటిదే.

సీనియర్ జర్నలిస్ట్ హరి..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు