Homeజాతీయంతృణముల్ విలీనం నిజమేనా?!.. మమతా బెనర్జీ అంత సాహసం చేస్తారా!!

తృణముల్ విలీనం నిజమేనా?!.. మమతా బెనర్జీ అంత సాహసం చేస్తారా!!

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ విలీనం అవుతుందా? అది సాధ్యమేనా? మమతా బెనర్జీ అంత సాహసం చేస్తారా? మరికొంత సమయం ఆమె వేచి చూడలేరా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో అదే చర్చ నడుస్తోంది.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. కోల్కత్తా నుంచి ఢిల్లీ దాకా రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. అక్కడ బిజెపి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అప్పటినుంచి మమతా టి.ఎం.సి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ నేతలంతా వరుస కట్టి వెళ్ళిపోతున్నారు. అత్యంత నమ్మకస్తులు సైతం ఉండలేకపోతున్నారు. దీంతో మమతా బెనర్జీ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • ఆ పరిణామాలతో..

ఇండియా కూటమి సమావేశం వేదికగా సోనియా గాంధీ, మమతా బెనర్జీల మధ్య జరిగిన ఆత్మీయ భేటీ.. అటు తరువాత అగ్రనేత రాహుల్ గాంధీని అభిషేక్ బెనర్జీ కలవడంతో ఈ విలీన వార్తలు మరింత పెరిగాయి. ప్రస్తుతం టీఎంసీ తీవ్రమైన అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొంటోంది. బెంగాల్ అసెంబ్లీలో గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 64 మంది వరకు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. తామే అసలైన టీఎంసీ గా చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు 20 మందికి పైగా ఎంపీలు ప్రత్యేక శిబిరానికి సిద్ధమయ్యారు. రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. ఘోరమైన ఈ సంక్షోభం నుంచి ఉనికిని కాపాడుకునేందుకు మమత కాంగ్రెస్ పార్టీ శరణు కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

  • ఖండించిన తృణమూల్ నాయకత్వం..

కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రచారాన్ని ఖండించింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. 2029 లోక్సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కునేందుకు అవసరమైన వ్యూహాల కోసమే రాహుల్ గాంధీని అభిషేక్ బెనర్జీ ఆశ్రయించినట్లు టీఎంసీ నాయకత్వం స్పష్టం చేసింది. 1998లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు మమతా బెనర్జీ. అలా వచ్చిన ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయగలిగారు. ఇప్పుడు అదే మమతా బెనర్జీని కాంగ్రెస్ లో చేర్చుకుంటే.. బెంగాల్ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది.

తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని రాజకీయ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు మమతా బెనర్జీ. సొంత పార్టీ ముక్కలయింది. పార్టీలో దిక్కారస్వరాలు పెరిగాయి. బిజెపి దూకుడును తట్టుకొని బెంగాల్ లో నిలబడే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీని ఒక రక్షణ కవచం లో వాడుకోవాలని చూస్తున్నారు. అయితే బిజెపి దూకుడు ఇదే మాదిరిగా కొనసాగి.. కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితుల్లో ఉంటే మమతా బెనర్జీ తప్పకుండా విలీన ప్రక్రియకు ఒప్పుకుంటారన్న అంచనాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ విలీనం అయితే బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి కొండంత ఉపశమనం. జాతీయ స్థాయిలో సైతం కలిసి వచ్చే అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు