కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. 2028లో జరగనున్న ఎన్నికలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
వయసు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఎన్నికల పోటీకి వెళ్లడం సరికాదని భావించానని ఆయన తెలిపారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అయితే రాజకీయాల నుంచి పూర్తిగా దూరం కావడం లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ప్రజల సేవే తన ప్రధాన లక్ష్యమని ఆయన మరోసారి గుర్తుచేశారు.
ఈ ప్రకటనతో కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఆయన నిర్ణయం భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
also read: కోదాడ బైపాస్‌పై భయానక దృశ్యం.. కారు బోల్తా, వెంటనే అగ్నికి ఆహుతి
