దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సుమారు మూడు నెలల వ్యవధిలో ఒక్కో ఆయుధాన్ని చోరీ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు అనుమానిస్తున్నారు.
చోరీకి పాల్పడే సమయంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీటీవీ కెమెరాలను నిలిపివేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అదే సమయంలో భద్రతా విధుల్లో ఉన్న గార్డులను కూడా అక్కడి నుంచి పక్కకు పంపినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయుధాల భద్రపరిచే ప్రదేశంలోని తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
అంతేకాకుండా, చోరీకి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఆయుధాలు ఎక్కడికి తరలించారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యంగా ఆయుధాల చోరీకి ఉగ్రకుట్రతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: డిచ్‌పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: ఒకరు మృతి
