హరియాణాలో ఇద్దరు వివాహిత మహిళలు తమ భర్తలకు తెలియకుండా నలుగురు పిల్లలను వెంట తీసుకుని ఇళ్ల నుంచి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులని, కాలక్రమంలో వారి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
సెప్టెంబరు 9న ఇద్దరు మహిళలు తమ తమ పిల్లలను వెంట తీసుకుని ఇళ్ల నుంచి అదృశ్యమయ్యారు. వారు వెళ్లిపోయే సమయంలో ఇళ్లలోని సుమారు రూ.9 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లినట్లు భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మహిళల మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలించగా.. ‘మై లవ్’, ‘మై క్యూట్ వైఫ్’ వంటి సందేశాలు కనిపించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలు, పిల్లల ఆచూకీ కోసం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు? నగదు, ఆభరణాలు నిజంగానే వెంట తీసుకెళ్లారా? అనే అంశాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: భార్య, ఇద్దరు పిల్లల మరణం.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య
