Homeక్రైమ్డిచ్‌పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: ఒకరు మృతి

డిచ్‌పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

also read: పల్నాడులో విషాదం.. యూరియా కలిసిన దాణా తిని 18 గోవుల మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు