Homeతెలంగాణహిజ్రా 'మాఫియా'!.. తెర వెనుక బలమైన నెట్వర్క్

హిజ్రా ‘మాఫియా’!.. తెర వెనుక బలమైన నెట్వర్క్

  • నగరంలో ఏ మూల శుభకార్యం జరిగిన ఇట్టే సమాచారం 

  • వ్యాపారులు, సేవకులే అసలు సూత్రధారులు

  • ఆటో డ్రైవర్లు, టెంట్ హౌస్ కాంట్రాక్టర్లు సైతం

  • పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : భాగ్యనగరంలో హిజ్రాలకు ఒక మాఫియా నెట్వర్క్ ఉందా? అంతలా విస్తరించిందా? ఎక్కడో మూలన జరిగే చిన్న వేడుక సమాచారం వారికి ఎలా తెలుస్తోంది. కచ్చితంగా దీని వెనుక నెట్వర్క్ ఉంటుంది. ఎక్కడైనా శుభకార్యం జరిగితే చాలు ఇట్టే వాలిపోతున్నారు. ఇదో చిన్న అంశంగా భావించిన పోలీసులు పట్టించుకోలేదు. అదే నెట్వర్క్ పెరిగి ఒక మాఫియాగా మారింది. శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి ఈ నెట్వర్క్ మూలాలను తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.తిలా పాపం తలో పిడికెడు అన్నట్టు.. హిజ్రాలు తాము సంపాదిస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని సమాచారం ఇచ్చే నెట్వర్క్ కు ఇస్తుండడంతో పెరిగి పెద్దదయింది ఈ మాఫియా.

  •  సమగ్ర దర్యాప్తుతో..

హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో గృహప్రవేశాలు, వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, కుటుంబ వేడుకలు ఏమి జరిగినా నిమిషాల్లో అక్కడ ప్రత్యక్షమవుతున్నారు కొంతమంది ట్రాన్స్ జెండర్లు, క్రాస్ డ్రెస్సర్లు. వేలాది రూపాయలు డిమాండ్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇదో పెద్ద మాఫియాగా కూడా మారింది. బాధితులు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు, ఫిర్యాదులు ఆధారంగా తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు దీనిని సీరియస్ అంశంగా తీసుకున్నారు. ఎక్కడో మూలన జరిగే వేడుకల విషయాన్ని వీరికి ఎవరు తెలియజేస్తున్నారు అనే విషయంపై దర్యాప్తు చేశారు. ఈ నెట్వర్క్ గుట్టును రట్టు చేశారు.

  •  డబ్బు కోసమే..

శుభకార్యం జరుగుతుందంటే ఉదయాన్నే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు ట్రాన్స్ జెండర్లు. అయితే వీరికి సమాచారం ఇచ్చేది మాత్రం స్థానిక వ్యాపారులు, సేవకులు అని స్పష్టమవుతోంది. ఆటో డ్రైవర్లు, టెంట్ హౌస్ కాంట్రాక్టర్లు, శుభకార్యాలు నిర్వహించే పంతుళ్ళు, డెకరేషన్ తో పాటు ఫ్లవర్ వెండర్లు వీరికి సమాచారం అందిస్తున్న పోలీసుల దర్యాప్తులో తేలింది. కొంత డబ్బు కోసం ఈ సమాచారాన్ని వారికి అందిస్తున్నట్లు వెల్లడయింది. శుభకార్యాలకు ఇలా బుక్ చేసుకుంటారో లేదో అప్పుడే వీరు ట్రాన్స్ జెండర్ లకు సమాచారం అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

  •  సీరియస్ గా పోలీసుల దృష్టి..

హిజ్రాల అంశం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితికి రావడం పై పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. డీజీపీ సివి ఆనంద్ నుంచి పోలీస్ కమిషనర్ల వరకు వీటిపై సీరియస్ ఆదేశాలు జారీ అయ్యాయి. చట్టాన్ని అతిక్రమించి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా అసభ్యచాష్టలకు దిగే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఈ సమాచార నెట్వర్క్ లో భాగమైన ఆటో డ్రైవర్లు, ఫంక్షన్ సేవలందించే వర్గాలను పిలిపించి తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇటువంటి సమాచారాన్ని చేరవేస్తూ అక్రమ వసూళ్లకు సహకరిస్తే.. ఆ నేరంలో భాగస్వామ్యులుగా భావించి చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాదులో సురక్షితమైన వాతావరణం కల్పించడం.. ప్రజలకు మానసిక వేధింపుల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు