Homeతెలంగాణతెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు తీపికబురు.. గరిష్ట వయోపరిమితి పెంపు!

తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు తీపికబురు.. గరిష్ట వయోపరిమితి పెంపు!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్ నియామకాల్లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని ఎస్ఐ (సబ్-ఇన్స్పెక్టర్), కానిస్టేబుల్, మరియు ఇతర తత్సమాన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏజ్ లిమిట్ ను మరో 3 సంవత్సరాల పాటు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పీసీ డ్రైవర్ పోస్టులకు మాత్రం ఈ సడలింపు వర్తించదని స్పష్టం చేసింది.

విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి

ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పోలీస్, అగ్నిమాపక (ఫైర్), జైళ్లు, మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) వంటి వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది. వయోపరిమితి దాటిపోయిందని నిరాశతో ఉన్న ఎంతో మందికి ఇది ఒక గొప్ప అవకాశం.ఇప్పటికే ప్రభుత్వం ఒకసారి వయోపరిమితిని పెంచిన విషయం తెలిసిందే. తాజా పెంపు, ఆ పెంచిన ఏజ్ లిమిట్ కు అదనంగా వర్తిస్తుంది. అంటే, గతంలో ఇచ్చిన సడలింపుతో పాటు అదనంగా మరో 3 ఏళ్లు పొడిగించబడింది. దీంతో అభ్యర్థులు మరింత ఆత్మవిశ్వాసంతో తమ సన్నద్ధతను కొనసాగించవచ్చు. త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?’.. మీడియాపై పినరయి విజయన్ అసహనం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు