వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నందలూరు మండలం వెంకట రాజంపేట గ్రామానికి చెందిన చింతకాయల వెంకటరతయ్య (40) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.
పొలంలో ఉన్న విద్యుత్ మోటార్ గదిలోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురైన వెంకటరతయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న నందలూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వెంకట రాజంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
also read: ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, పలువురికి తీవ్ర గాయాలు
