Homeజాతీయంఎక్స్‌పైరీ మందులు చెత్తబుట్టల్లో వేస్తున్నారా?.. పర్యావరణానికి తీవ్ర ముప్పు అని నిపుణుల హెచ్చరిక!

ఎక్స్‌పైరీ మందులు చెత్తబుట్టల్లో వేస్తున్నారా?.. పర్యావరణానికి తీవ్ర ముప్పు అని నిపుణుల హెచ్చరిక!

గడువు తీరిన మందులను ఇంట్లో నుంచి బయట పారేసే విషయంలో చాలామంది తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కాలం చెల్లిన ట్యాబ్లెట్లు, సిరప్‌లను ఎక్కడపడితే అక్కడ పారేయడం వల్ల మానవ ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గడువు తీరిన మందులను డ్రైనేజీల్లో, వీధి చెత్తబుట్టల్లో లేదా వాష్‌బేసిన్‌లు, టాయిలెట్లలో వేసి ఫ్లష్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆ మందులలో ఉండే క్షారాలు, రసాయనాలు నేరుగా భూమిలోకి ఇంకిపోయి, భూగర్భ జలాలను విషపూరితంగా మారుస్తాయి. ముఖ్యంగా కాలం చెల్లిన యాంటీబయాటిక్ మందులను నీటిలో లేదా నేలపై పారేయడం వల్ల బ్యాక్టీరియాల్లో ‘యాంటీబయోటిక్ రెసిస్టెన్స్’ విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో చిన్నపాటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కూడా సాధారణ యాంటీబయాటిక్స్ పనిచేయని ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి.

అందుకే ఎక్స్‌పైరీ అయిన మందులను ఎట్టిపరిస్థితుల్లోనూ డ్రైనేజీల్లో గానీ, సింక్‌లలో గానీ వేయకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి కాలం చెల్లిన మందులను సురక్షితమైన పద్ధతిలో డిస్పోజ్ చేయడం కోసం సమీపంలోని ఆసుపత్రులకు లేదా ఫార్మసీలకు అప్పగించాలని వారు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అవగాహన పెంచుకొని, బాధ్యతాయుతంగా వ్యవహరించి పర్యావరణాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మళ్లీ జనంలోకి వైఎస్ జగన్: వచ్చే ఏడాది భారీ పాదయాత్రకు రంగం సిద్ధం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు