Homeక్రైమ్జమ్మలమడకలో విషాదం.. పాడుబడిన ఇంట్లో నవజాత ఆడ శిశువు మృతదేహం

జమ్మలమడకలో విషాదం.. పాడుబడిన ఇంట్లో నవజాత ఆడ శిశువు మృతదేహం

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లో నవజాత ఆడ శిశువు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును అక్కడ వదిలి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

స్థానికులు శిశువు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మాచర్ల గ్రామీణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. శిశువు అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు వదిలి వెళ్లారు? అనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: జగిత్యాలలో విషాదం.. కుమారుడితో కలిసి బావిలో దూకిన తల్లి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు